5 రోజుల్లో సైరా ఎంత రాబట్టిందో తెలిస్తే షాక్! | 123Josh.com
Home న్యూస్ 5 రోజుల్లో సైరా ఎంత రాబట్టిందో తెలిస్తే షాక్!

5 రోజుల్లో సైరా ఎంత రాబట్టిందో తెలిస్తే షాక్!

0
877

భారీ అంచనాల నడుమ రిలీజైన పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి` ఐదు రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది? అంటే .. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచి 72కోట్ల షేర్ వసూలైంది. అటు అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. దాదాపు 200కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇంకా చాలా పెద్ద మొత్తాల్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అందుకు లాంగ్ రన్ లోనూ స్థిరంగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు రోజుల షేర్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఐదోరోజు ఏపీ – నైజాం వసూళ్లు పరిశీలిస్తే… వైజాగ్ -1.38 కోట్లు.. తూ.గో జిల్లా-55 లక్షలు.. ప.గో జిల్లా- 37లక్షలు.. కృష్ణ- 71లక్షలు.. గుంటూరు -73లక్షలు.. నెల్లూరు-30లక్షలు..  సీడెడ్-1.80కోట్లు.. నైజాం- 3.30కోట్లు వసూలు చేసింది.

ఐదు రోజుల్లో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ నుంచి 72.15కోట్ల మేర షేర్ వసూలైంది. ఏరియాల వారీగా వసూళ్లను చూస్తే.. వైజాగ్ -9.98 కోట్లు .. తూ.గో జిల్లా-7.39 కోట్లు .. ప.గో జిల్లా- 5.26కోట్లు .. కృష్ణ- 5.39 కోట్లు.. గుంటూరు -7.38కోట్లు .. నెల్లూరు-3.19కోట్లు ..  సీడెడ్-12.61కోట్లు .. నైజాం-20.95కోట్లు కలెక్టయ్యింది. ఈ దసరా సెలవులు పూర్తయినా వసూళ్ల దూకుడు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే సైరా బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్ కి చేరగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here