77 కోట్లు ఏంటి సామీ…ఇది నిజమేనా?? | 123Josh.com
Home గుసగుసలు 77 కోట్లు ఏంటి సామీ…ఇది నిజమేనా??

77 కోట్లు ఏంటి సామీ…ఇది నిజమేనా??

0
697

జీఎస్టీ అధికారులు సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ భారీ సిండికేట్ ల గుట్టు మట్లు కనిపెడుతున్న సంగతి తెలిసిందే. డబ్బు ఎలా చేతులు మారుతోంది? ఎవరు ఎంత ఎగ్గొడుతున్నారు? వగైరా వగైరా వివరాలపై ఆరాలు తీస్తున్నారు. సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లను భేరీజు వేసుకుని ఆ సొమ్ములన్నీ ఎలా తారుమారు అవుతున్నాయి? అన్నదానిపైనా పన్ను ఎగవేత దారులకు సంబంధించిన ఆరాలు తీసి పక్కా ఆధారాలతో బుక్ చేస్తున్నారు.

జీఎస్టీ ఎగ్గొట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో స్కీమ్ ని అనుసరిస్తుంటే వాటన్నిటి పైనా పక్కా ఆధారాల్ని సేకరించి కేసులు బుక్ చేస్తున్నారు. గత రెండ్రోజులుగా తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ పై జీఎస్టీ అధికారుల దాడుల గురించి తెలిసిందే. విజయ్ తో అనుబంధం ఉన్న ప్రముఖ ఫైనాన్షియర్ ఏజీఎస్ గ్రూప్ అధినేత అన్బు చెజియాన్ కి సంబంధించిన ఇల్లు- కార్యాలయాలపై

దాడులు నిర్వహించి దాదాపు 77 కోట్ల మేర క్యాష్ ని కనుగొన్నారు. దాదాపు 40 చోట్ల ఒకేసారి ఈ దాడులు సాగాయి. దాడుల్లో దొరికిన డబ్బుకు లెక్కలు చూపించడం లో అన్బు సరైన ఆధారాలు చూపించ లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే అన్బుతో ఆర్థిక వ్యవహారాల్లో విజయ్ కి లింకులు ఉన్నట్టు గా అధికారులు గుట్టు విప్పారు. విజయ్ పన్ను ఎగ్గొట్టాడన్న ఆరోపణలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here