రంగస్థలం ఇండస్ట్రీ హిట్…బాలీవుడ్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!! | 123Josh.com
Home గుసగుసలు రంగస్థలం ఇండస్ట్రీ హిట్…బాలీవుడ్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!!

రంగస్థలం ఇండస్ట్రీ హిట్…బాలీవుడ్ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!!

0
3844

  రామ్ చరణ్ ఇప్పడు రంగస్థలం సాధించిన సక్సెస్ తో బోలెడంత ఖుషీగా ఉన్నాడు. టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులన్నీ కొట్టేసిన మెగా పవర్ స్టార్ కు.. బాలీవుడ్ లో కూడా నిలదొక్కుకోవాలనే కోరిక ముందు నుంచే ఉంది. ఐదేళ్ల క్రితమే జంజీర్ అంటూ బాలీవుడ్ లో ఓ ప్రయత్నం చేశాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించినా.. ఈ చిత్రం సక్సెస్ కాదు కదా.. దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు రంగస్థలం సక్సెస్ తో జోష్ మీదున్న చెర్రీ.. తాజాగా రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇఛ్చాడు. ‘బాలీవుడ్ సినిమాలు చేయకూడదనే ఉద్దేశ్యం నాకేమీ లేదు.

ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. కానీ ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. అయినా గత రెండేళ్లుగా తెలుగు సినిమా బౌండరీలు దాటిపోయింది. బాహుబలి.. అర్జున్ రెడ్డి.. రంగస్థలం చిత్రాలు.. కంటెంట్ కు హద్దులు లేవనే విషయాన్ని ప్రూవ్ చేశాయి’ అని చెప్పిన చెర్రీ.. తాను బాలీవుడ్ పై ఫ్యూచర్ లో దృష్టి పెడతానని ఇన్ డైరెక్టుగా చెప్పాడు.

ప్రస్తుతం రంగస్థలం మూవీని డబ్బింగ్ చేస్తామంటూ అనేక భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పిన చెర్రీ.. ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకోబోనని అన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాంచి మాస్ కంటెంట్ తో అభిమానులను అలరించేందుకు ఫిక్స్ అయ్యాడు చరణ్. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు బోయపాటి అండ్ టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here