ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి తో మరో సెంసేషన్ క్రియేట్ చేశాడు. మెగాస్టార్ పుట్టినరోజు కి ఒకరోజు ముందుగానే రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
టీసర్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించిన విధానం అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకోగా మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. ఇక మగధీరని మరిపిస్తూ చెట్ల చాటు నుండి గుర్రం పై మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చిన విధానం రోమాలు నిక్కబొర్చుకునేలా చేశాయి.
చివర్లో మరోసారి మగధీరని మరిపిస్తూ గుర్రం పై చిరు స్వారీ ఓ రేంజ్ లో పూనకాలు తెప్పించింది. ఓవరాల్ గా టీసర్ అందరి అంచనాలను మించే విధంగా ఉండగా సినిమా పై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పొచ్చు. ఇక యూట్యూబ్ లో సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.