చిరు గ్యాంగ్ లీడరే…RC12 సినిమా…టాలీవుడ్ మొత్తం షాక్!! | 123Josh.com
Home గుసగుసలు చిరు గ్యాంగ్ లీడరే…RC12 సినిమా…టాలీవుడ్ మొత్తం షాక్!!

చిరు గ్యాంగ్ లీడరే…RC12 సినిమా…టాలీవుడ్ మొత్తం షాక్!!

0
10812

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కోసం మెగా అభిమానుల తో పాటు సామన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నారు. ఊరమాస్ మూవీ కి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో సినిమా ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరి లోను పెరిగి పోయింది అని చెప్పాలి.

కాగా ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని పోలి ఉంటుంది అని అంటున్నారు. గ్యాంగ్ లీడర్ లో చిరుకి ఇద్దరు అన్నలు కాగా ఈ కథలో రామ్ చరణ్ కి మొత్తం 5 గురు అన్నలట. గ్యాంగ్ లీడర్ లో ఒక అన్నని విలన్స్ చంపితే అది ప్రీ క్లైమాక్స్ లో తెలుసుకున్న చిరు భీభత్సం సృష్టిస్తాడు.

ఇక్కడ 5 గురు అన్నలలో ఒకరిని విలన్స్ చంపగా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కి అది తెలిసినా రామ్ చరణ్ కి చెప్పారట. కానీ ప్రీ క్లైమాక్స్ లో తెలిసిన తర్వాత విలన్ల బెండు తీస్తాడని అంటున్నారు. గ్యాంగ్ లీడర్ మిడిల్ క్లాస్ బ్యాగ్ డ్రాప్ లో ఉంటె ఇక్కడ రాజ వంశస్థులుగా చూపెట్టబోతున్నారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది త్వరలో తెలుస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here