KGF హీరో యష్ కొత్త సినిమా ఇదేనా?? | 123Josh.com
Home గుసగుసలు KGF హీరో యష్ కొత్త సినిమా ఇదేనా??

KGF హీరో యష్ కొత్త సినిమా ఇదేనా??

0
2766

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు.రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి సినిమా ఒక యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడట.

కన్నడ డైరెక్టర్ నార్తన్ తో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే దీనిపై యష్ – నార్తన్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. డైరెక్టర్ నార్తన్ 2017లో ‘మఫ్టీ’ అనే సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. ప్రస్తుతం నార్తన్ తమిళ హీరో శింబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే యష్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here