KGF2 అప్ డేట్ వచ్చేస్తుందోచ్!! | 123Josh.com
Home గుసగుసలు KGF2 అప్ డేట్ వచ్చేస్తుందోచ్!!

KGF2 అప్ డేట్ వచ్చేస్తుందోచ్!!

0
3125

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందుతున్న KGF2 చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర అయిన అధీర గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అధీర లుక్ రివీల్ అయ్యింది.ఈనెల 29న సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్దం అయ్యారు.

అందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. 60 సెకన్లు ఉండబోతున్న ఆ వీడియోలో అధీర గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. సంజయ్ దత్ పాత్రతో కేజీఎఫ్ 2 సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ మొదటి నుండి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

వారి నమ్మకం ప్రకారమే అధీర పాత్రను అత్యంత విభిన్నంగా పవర్ ఫుల్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడట. వచ్చే నెల నుండి కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ ను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కాని కరోనా కారణంగా షూటింగ్ జరగలేదు. దాంతో సినిమా విడుదల ఆలస్యం అవ్వబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here