అరవింద సమేత లో పూనకాలు తెప్పించే ఐటమ్ సాంగ్…హీరోయిన్ ఈమె! | 123Josh.com
Home గుసగుసలు అరవింద సమేత లో పూనకాలు తెప్పించే ఐటమ్ సాంగ్…హీరోయిన్ ఈమె!

అరవింద సమేత లో పూనకాలు తెప్పించే ఐటమ్ సాంగ్…హీరోయిన్ ఈమె!

0
5961

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ హైదరాబాద్ కొంపల్లి పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. పక్కా ప్లానింగ్ తో ఎక్కడా గ్యాప్ రాకుండా దసరాని టార్గెట్ గా పెట్టుకుని మరీ పూర్తి చేస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. త్రివిక్రమ్ స్టైల్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మాస్ ఫాన్స్ కు కావలసిన యాక్షన్ మసాలాకు ఇందులో లోటేమి లేదని క్లారిటీ రావడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఐటెం సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

త్రివిక్రమ్ కు తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్టడం ఇష్టం ఉండదు. వాటి బదులు హీరోయిన్ కనిపించని డాబా లేదా పబ్ సాంగ్స్ పెడుతూ ఉంటాడు. అజ్ఞాతవాసిలో అదేమీ చేయలేదు.  కానీ ఇది తారక్ సినిమా కాబట్టి అభిమానుల కోసమైనా ఐటెం సాంగ్ ఉంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీని కోసం కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. గతంలో జనతా గ్యారేజ్ కోసం నేను పక్కా లోకల్ అంటూ కాజల్ వేసిన స్టెప్స్ ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతకు ముందు బాద్షాలో కలిసి నటించింది కాజల్. మరోసారి త్రివిక్రమ్ సినిమా కోసం కాజల్ ఓకే చెప్పినట్టు న్యూస్.

ఇది ఇంకా యూనిట్ నుంచి ఖరారు కావాల్సి ఉంది. జై లవకుశలో తమన్నా స్వింగ్ జరా అంటూ కిక్ ఇస్తే ఇప్పుడు ఈ అరవింద సమేతలో తమన్ ఇచ్చే ట్యూన్ కి తారక్ చేయబోయారు రచ్చ ఇంకే రేంజ్ లో ఉంటుందో. అన్ని ఎమోషన్స్ ని పక్కాగా మిక్స్ చేసి త్రివిక్రమ్ దీనికి స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. పూజా హెగ్డేతో పాటు ఈషా రెబ్బా కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది అనే టాక్ కూడా వచ్చింది కానీ వీటన్నిటికీ అఫీషియల్ స్టాంప్ పడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here