అరవింద సమేత ఫస్ట్ లుక్ అండ్ టీసర్ రిలీజ్ అయ్యాక అందరికీ వచ్చిన తాట్ ఏంటి అంటే ఇది పక్కా ఎన్టిఆర్ మాస్ మసాలా మూవీ అని భావించారు. కానీ ఇది క్లాస్ ని కూడా ఆకట్టుకునే త్రివిక్రమ్ మార్క్ మూవీ అని చాలా మంది మరిచిపోయారు.
దానికి త్రివిక్రమ్ తప్పు కూడా ఉందని చెప్పొచ్చు…ఎన్టిఆర్ ని మాస్ గా చూపెట్టాలి అన్న భావనలో క్లాస్ ని కూడా మెప్పించేలా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఆ భావనని ఒక్క పోస్టర్ తో చెరిపెసేలా చేసి ఇది త్రివిక్రమ్ మార్క్ మూవీ కూడా అనిపించుకున్నారు త్రివిక్రమ్.
వినాయక చవితి కానుకగా అరవింద సమేత లోని సెకెండ్ పోస్టర్ ని రివీల్ చేశారు, క్లాస్ లుక్ తో ఎన్టిఆర్ డాషింగ్ గా కనిపిస్తూ మరోసారి మెప్పించాడు. త్వరలోనే ఆడియో రిలీజ్ అని తెలిసినా డేట్ కంఫామ్ కాలేదు అన్న భావనని కూడా చెరిపేస్తూ 20 న ఆడియో డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది అని కంఫామ్ చేశారు.