10 వేల థియేటర్స్ లో రోబో 2.0 ఊచకోత | 123Josh.com
Home న్యూస్ 10 వేల థియేటర్స్ లో రోబో 2.0 ఊచకోత

10 వేల థియేటర్స్ లో రోబో 2.0 ఊచకోత

0
3040

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా ‘2.ఓ’ సినిమా నిర్మితమైంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను పదివేల థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక దుబాయ్ లో ఒకే రోజున 100 ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ విషయంలోనే ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలనీ, సంచలన విజయం సాధించాలని భావిస్తున్నారు.

ఇటీవల వదిలిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. రజనీ కెరియర్లోనే ఈ సినిమా గర్వంగా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here