యంగ్ టైగర్ టెంపర్ తమిళ్ రీమేక్ ఫస్ట్ లుక్ ఊచకోత | 123Josh.com
Home న్యూస్ యంగ్ టైగర్ టెంపర్ తమిళ్ రీమేక్ ఫస్ట్ లుక్ ఊచకోత

యంగ్ టైగర్ టెంపర్ తమిళ్ రీమేక్ ఫస్ట్ లుక్ ఊచకోత

0
3269

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండి పోయే ‘టెంపర్’ చిత్రం తమిళం మరియు హిందీల్లో ఒకే సారి రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. హిందీలో చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. తమిళంలో ఈమద్యే షూటింగ్ ప్రారంభం అయ్యింది. తమిళంలో ఈ రీమేక్ లో హీరోగా విశాల్ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నై వైజాగ్ సాగర తీరంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. మురుగదాస్ చేతుల మీదుగా విడుదలైన ‘టెంపర్’ రీమేక్ చిత్రం ‘అయోగ్య’ ఫస్ట్ లుక్ విశాల్ అభిమానులను అలరిస్తోంది.

పోలీసు జీపు వద్ద చాలా స్టైల్ గా – చేతిలో బీర్ బాటిల్ తో విశాల్ కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ చూస్తేనే విశాల్ పాత్ర ఏంటో తమిళ ఆడియన్స్ కు అర్థం అవుతోంది. విశాల్ ఈ చిత్రం కోసం కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. గత చిత్రాలతో పోల్చితే విశాల్ ఈ చిత్రంలో సన్నగా కనిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here